జనసేన, పాల్, కాంగ్రెస్ ఎవరికి ఓటేసినా..

Vijaya Sai Reddy Fires On Chandrababu and Pawan Kalyan - Sakshi

చంద్రబాబుకు వేసినట్టే..

ఆ పార్టీ అ‍భ్యర్థులను ఖరారు చేసింది ఆయనే

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే ఈ కుట్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన, కేఏ పాల్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరికి ఓటేసినా చంద్రబాబుకు వేసినట్టేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి చంద్రబాబు ఇచ్చిన నిధులతోనే పవన్‌ కల్యాణ్‌, పాల్‌లు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ పార్టీల అభ్యర్థుల జాబితాను చంద్రబాబే ఫైనల్‌ చేశాడన్నారు. ప్రజలంతా వైఎస్‌ జగన్ వైపే ఉన్నా.. చతుర్ముఖ పోటీ ఉండేలా గుంట నక్క స్కెచ్ వేశాడని మండిపడ్డారు. బుధవారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, కేఏ పాల్‌, పచ్చమీడియాపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

‘కొందరు బందిపోట్లు ఖజానా దోచుకుని అడవిలో పాతిపెట్టారట. మ్యాపులో గుర్తులను గీసి తలా ఒక ముక్క తీసుకుని విడిపోయారట. దాచిన సొత్తు కోసం ఒకరికి తెలియకుండా ఇంకొకరు వెతుకుతున్నారు. చివరికి ప్రజల చేతికి చిక్కారు. ప్యాకేజి పార్టనర్ పావలా, పాల్, కాంగ్రెస్, కులమీడియానే ఈ బందిపోట్లు.’ అని వ్యంగాస్త్రాలు సంధించారు. 

గాడిద పళ్లు తోమారా?
‘రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచిపోయిందని, 60 నెలల్లో ఏపిని దేశంలోనే నెం.1 గా చేస్తానన్నారు. విభజన గాయాలు మానలేదు. కట్టుబట్టలతో వచ్చాం అని మళ్లీ సంతాప తీర్మానాలు చేస్తున్నారు. ఐదేళ్లు గాడిద పళ్లు తోమారా చంద్రబాబూ? పంచభూతాలను దోచుకుతినడం తప్ప ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా?’ అని నిలదీశారు.

అది సరిపోదు కులమీడియా దళారీ..
‘రాధాకృష్ణ  రోజుకో దొంగ సర్వే ప్రచురించి చంద్రబాబు గెలుస్తున్నాడని జాకీ పెట్టి తెగ హైరానా పడుతున్నాడు. ఒక్క జాకీ సరిపోదు కులమీడియా దళారీ. నాలుగు టైర్లూ ఫ్లాట్ అయ్యాయి. పచ్చ మీడియా జాకీలు, క్రేన్లు అన్నీ కలిపినా చతికల పడ్డ బాబును నిల్చోబెట్టలేరు. పాపం వయసై పోయింది కదా?’ అని సెటైర్లు వేశారు.

ట్రంపు మీద పోరాటం తర్వాత..
‘కర్నాటక మఖ్యమంత్రి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను ప్రచారానికి రప్పించారు. ఆల్మట్టి ఎత్తు పెంచేది లేదు. తుంగభద్ర కాలువల నుంచి జలదోపిడీ జరగకుండా చేసి కర్నూలు, కడప, అనంతపురాలను బీళ్లు కాకుండా చూస్తామని ఓ హామీ తీసుకోలేక పోయారా? చంద్రబాబూ. ట్రంపు మీద పోరాటం తర్వాత చేద్దురుగాని.’ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు

25-05-2019
May 25, 2019, 14:25 IST
16వ లోక్‌సభను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శనివారం రద్దు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాలు సొంతంగా గెలుచుకొన్న..
25-05-2019
May 25, 2019, 14:18 IST
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 86 వేల కోట్ల నుంచి 2 లక్షల 14 వేల కోట్ల రూపాయలకు పైగా...
25-05-2019
May 25, 2019, 14:00 IST
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ విడుదల అయింది. ఆయన శనివారం...
25-05-2019
May 25, 2019, 13:36 IST
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: తూర్పున ఉదయించే సూర్యుడు లోకానికి వెలుగులు పంచడం ఎంత సహజమో.. ‘తూర్పు గోదావరి’ జిల్లాలో ఉదయించే...
25-05-2019
May 25, 2019, 13:33 IST
మాదీ పశ్చిమగోదావరే...మా నాన్న జిల్లాలో పనిచేశారు.మొగల్తూరు మా సొంతూరు అంటూ ఎన్నికల్లో పోటీచేసిన మెగా బ్రదర్స్‌కు డెల్టాప్రాంత ఓటర్లు పెద్ద...
25-05-2019
May 25, 2019, 13:26 IST
ఏపీ ఫలితాలపై తమిళ మీడియా ఆసక్తికర కథనాలు
25-05-2019
May 25, 2019, 13:25 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులకు సొంతూళ్లు, సొంత మండలాల్లో చుక్కలు కనిపించాయి. అనూహ్యంగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు...
25-05-2019
May 25, 2019, 13:23 IST
సాక్షి, నెల్లూరు: ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీ నేతలపై నోరుపారేసుకునే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ప్రత్యక్ష ఎన్నికలు కలిసిరావడంలేదు. ప్రజాక్షేత్రంలో...
25-05-2019
May 25, 2019, 13:20 IST
పశ్చిమ ప్రకాశంలో ఫ్యాన్‌ గాలి ప్రభంజనంలా వీచింది. ఫ్యాన్‌ హోరుకు సైకిల్‌ విలవిల్లాడింది. మెజారిటీల్లోనూ వైఎస్సార్‌ సీపీ రికార్డులు సృష్టించింది....
25-05-2019
May 25, 2019, 13:13 IST
సాక్షి, వికారాబాద్‌: ఎంపీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితాలు తాము ఊహించిన విధంగా లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి...
25-05-2019
May 25, 2019, 12:44 IST
కొండాపూర్‌(సంగారెడ్డి): వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ జిల్లా...
25-05-2019
May 25, 2019, 12:32 IST
వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రెండో మారు ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
25-05-2019
May 25, 2019, 12:23 IST
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని...
25-05-2019
May 25, 2019, 12:22 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయఢంకా మోగించింది. వరంగల్,...
25-05-2019
May 25, 2019, 12:20 IST
విశాఖ ఉత్తర: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి...
25-05-2019
May 25, 2019, 12:17 IST
విశాఖపట్నం , పాడేరు: పాడేరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రెండోసారి పాగా వేసింది. ఈ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి   ఉత్తరాంధ్ర...
25-05-2019
May 25, 2019, 12:07 IST
ఉద్దండుల్ని ఓడించిన ఘనత సొంతం
25-05-2019
May 25, 2019, 11:59 IST
సాక్షి, అమరావతి: ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఏ కష్టమొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే అండగా ఉందని ఆ...
25-05-2019
May 25, 2019, 11:47 IST
తనది గోల్డెన్‌ లెగ్‌ అని టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
25-05-2019
May 25, 2019, 11:37 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఘట్టం ముగిసింది. గెలుపోటములపై అభ్యర్థులు సమీక్షల్లో మునిగిపోయారు. విజేతలు మెజార్టీపై లెక్కలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top