
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని దిక్కరించి ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీపీసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. పార్టీ టికెట్ అశించి భంగపడ్డ నేతలను బుజ్జగింపులతో వెనక్కు తగ్గించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ.. వినని నేతలపై వేటు వేసింది.
సస్పెండ్ అయిన అభ్యర్థులు.. బోడ జనార్థన్ (చెన్నూర్), రవి నివాస్ (సిర్పూర్), అనిల్ జాదవ్ (బోథ్), నారయణరావు పటేల్ (ముథోల్), హరినాయక్ (ఖానాపుర్), రత్నాకర్ (నిజామాబాద్), అరుణతార (జుక్కల్), శివకుమార్ రెడ్డి (నారయణపేట), గణేశ్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్), సురేందర్ రెడ్డి (మహబూబ్‌నగర్), ఇబ్రహీం (మహబూబ్‌నగర్), శ్రవణ్ (మునుగోడు), బిల్యానాయక్ (దేవరకొండ), నెహ్రూ నాయక్ (డోర్నకల్), రవికుమార్ (తుంగతుర్తి), ఊకే అబ్బయ్య (ఇల్లందు), బానోతు బాలాజీ నాయక్ (ఇల్లందు), ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), రాములు నాయక్( వైరా). అలాగే మహబూబ్‌నగర్ జిల్లా, నారాయణరావుపేట నియోజకవర్గంలో రెబల్స్‌కు మద్దతుగా నిలిచిన ఐదుగురు స్థానిక నేతలపై కూడా వేటు వేసింది.