గ్లౌవ్స్‌తో కరచాలనం.. ఓటర్లపై ఇంత వివక్షా..?

TMC Candidate Mimi Chakraborty Shaking Hands With Gloves - Sakshi

టీఎంసీ అభ్యర్థిపై బీజేపీ ఫైర్‌

కోల్‌కత్తా: తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి, ప్రముఖ నటి మిమి చక్రవర్తి ఎన్నికల ప్రచారం వివాదాస్పదంగా మారింది. ప్రచారంలో భాగంగా ఆమె పోటీచేస్తున్న జాదవ్‌పూర్‌ నియోజకవర్గంలో శుక్రవారం తన కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చేతికి గ్లౌవ్స్‌లు ధరించి అభిమానులతో కరచాలనం చేశారు. ఈ చర్యతో ఆమె తీవ్ర విమర్శల పాలైయ్యారు. గ్లౌవ్స్‌లతో ఓటర్లతో కరచాలనం చేస్తున్న ఆమె ఫోటోను బీజేపీ నేత సురేందర్‌ పూనియా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దళితులు, మైనార్టీలను కనీసం చేతితో ముట్టుకోలేని వ్యక్తిని ఎలా పార్లమెంట్‌కు ఎన్నుకోవాలి. ఓటర్లపై ఇంత వివక్షా..? ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్‌కు వెళ్లేందుకు భారత ప్రజాస్వామ్యంలో అర్హత లేదని, ఘటన దురదృష్టకరమన్నారు.

ఆమెకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కామెంట్లు కావడంతో మిమి చక్రవర్తి స్పందించారు. ‘‘గత కొద్ది రోజులుగా విరామం లేకుండా ప్రచారం చేస్తున్న. కార్యకర్తలతో కరచాలనం చేసే సందర్భంగా వారి గోళ్లు తాకి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలకు రక్షణగా గ్లౌవ్స్‌ను వేసుకోవాల్సి వచ్చింది. అంటూ వివరించే ప్రయత్న చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top