రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌

Rajnath Singh takes charge as Defence Minister - Sakshi

న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా, నూతన నేవీ చీఫ్‌ కరంబీర్‌ సింగ్‌లతో రైసినా హిల్స్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, త్రివిధ దళాల పనితీరుపై వేర్వేరు నివేదికలు సిద్ధం చేయాలని వారికి సూచించారు.

ఈ సమావేశంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్, రక్షణ కార్యదర్శి సంజయ్‌ మిత్రా, సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్రివిధ దళాల్లో సుదీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఆధునీకరణను వేగవంతం చేయడంతో పాటు వారి పోరాట సంసిద్ధతకు భరోసా ఇవ్వడం, అలాగే చైనాతో సరిహద్దు వద్ద శాంతి నెలకొల్పటం, చైనా నుంచి వచ్చే ఎలాంటి వ్యతిరేకతనైనా ఎదుర్కోడానికి అవసరమైన సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ముందున్న అత్యంత కీలక సవాళ్లు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top