మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా! | Navjot Singh Sidhu Resigns as Punjab Minister | Sakshi
Sakshi News home page

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

Jul 14 2019 12:32 PM | Updated on Jul 14 2019 2:59 PM

Navjot Singh Sidhu Resigns as Punjab Minister - Sakshi

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాసిన లేఖను ట్వీటర్‌లో పంచుకున్నారు.

చండీఘడ్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాసిన లేఖను ట్వీటర్‌లో పంచుకున్నారు. జూన్‌ 10నే ఈ లేఖను రాహుల్‌ గాంధీకి ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందర​సింగ్‌ ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తీరణతో సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్‌ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు.

ఈ నేపథ్యంలో సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్‌ గాంధీతో సిద్ధూ గత నెల 10న ప్రత్యేకంగా సమావేశంమయ్యారు. తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని రాహుల్‌ వద్ద సిద్ధూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement