‘ఎన్టీఆర్‌ ఆదర్శాలకు నీళ్లొదిలిన టీడీపీ’

Narendra Modi Message On His AP And Telangana Tour - Sakshi

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో స్పందించారు. శుక్రవారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మోదీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మోదీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా ఆ పరిసరాల ప్రాంతాల్లోని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని తెలిపారు. దేశ ప్రజలు తిరిగి ఎన్డీయే మిత్ర పక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో కూడా వివరంగా చెప్తానని పేర్కొన్నారు.

కర్నూలు ఒక ర్యాలీలో పాల్గొంటానని తెలిపిన మోదీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ఆదర్శాలకు నీళ్లొదిలి టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతుందని విమర్శించారు. అవినీతి, బలహీనమైన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉందని అన్నారు. యువత కలలు నెరవేర్చటానికి తాను ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top