పో..పోవోయ్‌ పప్పూ! | Nara Lokesh One More Campaign Photo Becomes Viral | Sakshi
Sakshi News home page

పో..పోవోయ్‌ పప్పూ!

Apr 6 2019 6:34 PM | Updated on Apr 6 2019 6:48 PM

Nara Lokesh One More Campaign Photo Becomes Viral - Sakshi

చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్‌కు సంబంధించిన ఓ ఫొటో ఇటీవల నెట్టింట కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.  ప్రచారంలో ఓ మహిళ లోకేశ్‌ బుగ్గులను పట్టుకొని మాట్లాడుతున్నట్టు ఉన్న ఆ ఫొటోపై నెటిజన్లు ​‍కుళ్లు జోకులు పేల్చారు. ఏదీ ఒక్కసారి మంగళగిరి.. అను’ అని ఒకరు ‘ఏది ఒక్కసారి నోరు తెరువు.. డౌట్‌ లేదు.. అబ్బాయి నాలుక మందమే’ అని మరొకరు చమత్కరించారు. అయితే తాజాగా లోకేష్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

నిన్న(శుక్రవారం) మందలగిరి.. సారీ మంగళగిరిలో ప్రచారం నిర్వహించిన చినబాబుకు.. ప్రజల నుంచి స్పందన రాక నిట్టూర్చారు. ఇంతలో ఓ చిన్నారి పసుపు డ్రస్‌లో కనిపించింది. ఇంకేముంది అబ్బ.. దొరికింది చాన్స్‌ అనుకుంటూ పాపను ఎత్తుకున్నారు. హాయ్‌ బుజ్జీ.. అంటూ బుగ్గలు లావు చేశారు.. ఎలాంటి స్పందన లేదు. ఏంటి నవ్వవా? అంటూ మాలోకంలా నటించారు. కానీ ఆ చిన్నారి డోంట్‌కేర్‌ అనుకుంది. చినబాబుకు ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్లు పెద్దవి చేసి నోరు తెరచి ఆయ్‌ అంటూ గదమాయించారు. అయినా చిన్నారి అదరలేదు.. బెదరలేదు..  పోయ్‌పోవోయ్‌.. నీ పప్పులు నా దగ్గర ఉడకవంటూ ఊరుకుండిపోయింది. దీంతో కంగుతిన్న మాలోకం.. దిక్కుతోచక ఉసూరుమంటూ ముందుకు సాగాడు. ఇక ఈ ఫొటోపై కూడా నెటిజన్లు తమదైన శైలిలో కుళ్లు జోకులు పేల్చుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement