‘కాంగ్రెస్‌ నాయకులు కరెంట్‌ తీగలు పట్టుకోండి’

MP Balka Suman Fires On Congress Party Leaders - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌ ప్రజలకు ఏం చేసిందని అడుగుతున్నారు.. మీరంతా ఒక్కసారి కరెంట్‌ తీగలు పట్టుకోండి.. అప్పుడు తెలుస్తది మా ప్రభుత్వం ఏం చేసిందో అంటూ ధ్వజమెత్తారు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బాల్క సుమన్‌. శుక్రవారం వేల్పూర్‌ మండలం లక్కొరాలో నిర్వహించన టీఆర్ఎస్ యువ సమ్మేళనానికి బాల్క సుమన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దొంగలు మాయమాటలు చెబుతున్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్నారు. మరి నెహ్రూ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రాజకీయాల్లోకి వచ్చారు కదా. వారిది కుటుంబ పాలన కాదా అని బాల్క సుమన్‌ ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ ఒక్క ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. దమ్ముంటే ఫోటోలు పంపించండి అంటూ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌ ప్రజలకు ఏం చేసింది అని అడుగుతున్నారు.. ఒక్కసారి కరెంట్‌ తీగలు పట్టుకోండి. మీకే తెలుస్తది అంటూ మండిపడ్డారు.

రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని బాల్క సుమన్‌ తెలిపారురు. కరెంట్‌ అడిగితే కాల్పులు జరిపిన నీచుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. నిరుద్యోగుల కోసం కేసీఆర్‌ రూ. 3016 నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఎన్నికల తర్వాత అది కూడా అమల్లోకి వస్తుందని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top