ఆయన వల్లే కృష్ణపట్నం పోర్టు వచ్చింది: కాకాణి

Krishnapatnam Port Is Only Because Of YSR Says Kakani - Sakshi

సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కారణంగానే ముత్తుకూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు.. పరిశ్రమలు వచ్చాయని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు పరిపాలిస్తున్న గత ఐదేళ్లలో ఒక పరిశ్రమ కూడా రాలేదన్నారు. రుణమాఫీ పేరుతో  రైతులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలు రావడంతో పసుపు.. కుంకుమ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వల్లే డ్వాక్రా మహిళలకు పూర్తి రుణ మాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top