
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసమే లాంగ్ మార్చ్ నిర్వహించారని పౌర సరఫ రాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఎద్దేవా చేశారు. సమస్య పరిష్కారానికి ఏదైనా పరి ష్కారం సూచిస్తారనుకుంటే.. తలా తోక లేకుండా నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర సచివా ల యంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణలకు ఫోన్ చేసి లాంగ్‌మార్చ్‌కు ఆహ్వా నించారన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా ఆ కార్యక్రమం కొనసాగిందని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఉద్యమానికి భవన నిర్మాణ కార్మికుల్లో ఒక్కరు కూడా వెళ్లలేదనే విషయాన్ని ఆయన గుర్తించాలని సూచించారు. ‘జనం పిచ్చి వాళ్లని పవన్ అనుకుంటున్నారు. ఏపీలో ఛీఛీ కులపిచ్చి పెరిగింది అంటున్నారు. చంద్రబాబు పేరుకు చివర నాయుడు తీసేసి మాట్లాడుతున్నారు. జగన్‌ను మాత్రం జగన్‌రెడ్డి అంటూ వత్తి చెబుతున్నారు. అంటే కులాలను గుర్తు చేస్తున్నది పవన్ కళ్యాణ్ కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇసుకను దోచుకుని రూ.వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అధికారానికి దూరమైన చంద్రబాబు పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతుంటే.. ఆయన కొడుకు లోకేష్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.