విచక్షణ మరిచి ప్రధానిని తిడతారా? | Kishan reddy on balakrishna and chandrababu naidu | Sakshi
Sakshi News home page

విచక్షణ మరిచి ప్రధానిని తిడతారా?

Apr 22 2018 2:12 AM | Updated on Aug 29 2018 1:59 PM

Kishan reddy on balakrishna and chandrababu naidu  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విచక్షణ మరిచి ప్రధాని నరేంద్రమోదీపై పరుషపదజాలంతో నిందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, తన సమక్షంలోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నా ముసిముసి నవ్వులు నవ్విన ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అధికార వ్యామోహంతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దెదింపిన ఈ ఇద్దరికీ ప్రధాని మోదీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. బాబుకు ఓటమి భయం పట్టుకున్నప్పుడల్లా బీజేపీ పంచన చేరి, ఆ పార్టీ అండతో విజ యం సాధించారని దుయ్యబట్టారు. 2014లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలిచే అవకాశం ఉండటంతో నరేంద్ర మోదీ, పవన్‌కల్యాణ్‌ల సహకారంతో గెలిచిన విషయాన్ని బాబు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగువారి ప్రతిష్టను దిగజార్చేలా ప్రధానిపై బాలకృష్ణ అను చిత వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రబాబు హస్తముందన్నారు. మోదీని కొట్టికొట్టి తరుముతానని, బంకరులో దాక్కున్నా లాక్కొచ్చి కొడతానని బాలకృష్ణ అనడం హేయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement