బాలకృష్ణపై కేసు.. చంద్రబాబే సాక్షి! | Somu Veerraju Files A Case Against Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణపై కేసు.. చంద్రబాబే సాక్షి!

Apr 21 2018 7:01 PM | Updated on Aug 29 2018 1:59 PM

Somu Veerraju Files A Case Against Balakrishna - Sakshi

సాక్షి, కాకినాడ: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం చేసిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజమండ్రి అర్బన్ ఎస్పీకి సోము వీర్రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు గానూ సీఎం చంద్రబాబును సాక్షిగా చేర్చాలని, ఆయన సమక్షంలోనే బాలయ్య బూతు పురాణం నడిచిందని ఎస్పీకి వివరించారు. సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడని బీజేపీ నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలే బాలకృష్ణకు భాషపై పట్టుతక్కువని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో బాలకృష్ణతో పాటు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి అర్బన్ ఎస్పీని కోరినట్లు సోము వీర్రాజు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement