కాచిగూడ కార్పొరేటర్‌కు హైకోర్టులో ఊరట

High Court Relief to TRS Kachiguda Corporater Yekkala Chaithanya  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారంటూ ఆమెను అనర్హురాలుగా నాంపల్లి కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు తీర్పుపై కార్పొరేటర్‌ చైతన్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం నాంపల్లి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. కాగా ఎక్కాల చైతన్య ముగ్గురు సంతానం ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టారంటూ బీజేపీ మాజీ కార్పొరేటర్‌ ఉమాదేవీ భర్త రమేష్‌యాదవ్‌ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సవాల్‌చేస్తూ కార్పొరేటర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top