కేసీఆర్‌ ఆ వీడియోలు చూపించు: డీకే అరుణ | Dk Aruna Fires On CM Kcr Over TRS Wanaparthy Public Meeting Comments | Sakshi
Sakshi News home page

Oct 6 2018 11:34 AM | Updated on Mar 18 2019 9:02 PM

Dk Aruna Fires On CM Kcr Over TRS Wanaparthy Public Meeting Comments - Sakshi

టీఆర్‌ఎస్‌ నా కొడుకులు.. పిల్లలను చంపుతున్నారని..

సాక్షి, హైదరాబాద్‌ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని, దీంతోనే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వనపర్తి సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌తో మాట్లాడి ప్రజలను మోసం చేయాలనే ధోరణిలో కేసీఆర్‌ ఉన్నారని విమర్శించారు. ఆయన మాటలను చూస్తేనే టీఆర్ఎస్‌ ఓడిపోతుందని స్పష్టమవుతుందన్నారు. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఆయన భావిస్తున్నట్లు ఉందని, ఆయన మాటల్లో ప్రస్టేషన్ కనబడుతోందన్నారు. ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా చెల్లిందని, ఇంకా అదే మాట్లాడుతానంటే కుదురదని, తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్లు కాదన్నారు.

కేసీఆర్‌ ఏం ఓరగబెట్టినవ్‌..
‘పాలమూరుకు ఏం ఓరగబెట్టినవ్‌.. 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినవా? ఇంకా జుటాకోర్‌ మాటలు మాట్లాడుతావా? 5 ఏళ్లు పాలమూరు ఏంపీ గా ఉండి ఏం చేసినవ్..జూరాలా, ఆర్డిఏస్,నెట్టెంపాడులకు ఓరగబెట్టింది ఏముంది.. ప్రాజెక్టుల వద్ద పడుకోని మీ నాయకులు ఏం చేసారు? తాము కట్టించిన గెస్ట్‌ హౌస్‌లో ఎంజాయ్‌ చేసారు. డీకే అరుణమ్మ బండారం బయట పెడ్తావా? నాలుగేళ్లుగా ఏం చేశినావ్‌? దమ్ముంటే బయట పెట్టు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తావా?. ఓ శక్తి గురించి మాట్లాడుతున్నావ్‌. కేసీఆర్‌ ఖబర్దార్‌.

రఘువీరా రెడ్డి గారికి మంగళహారుతులు పట్టినా అని అన్నావ్‌.. దమ్ముంటే వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపించు. రాజకీయం కోసం పూటకో పార్టీ మార్చినవ్‌ నీవు. దుబాయ్‌ శేఖర్‌గా పేరుపొందిన నీవు,. నా గురించి మాట్లాడుతావా? నా బండారం బయటపెడ్తావా? ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినా. ఒక్కో వేదికపై  నీ చరిత్రను బట్టబయలు చేస్తాం. గద్వాల్లో ప్రతి ఇంట్లో అరుణమ్మ ఫొటో ఉంది. పాలమూరు ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి మాట్లాడుతావా?

పిల్లలను చంపుతున్నరని..
ఉద్యమం గురించి నిరాహారదీక్ష నువ్వు చేసినావా? నిమ్స్ ఆస్పిటల్ పోదం.. రా? నీ రిపోర్ట్‌లు బయటపెడతాం...ఈ టీఆర్ఏస్ నాయకులు మోసం చేసి.. తెలంగాణ పిల్లలను చంపుతున్నరు...అని తెలంగాణ ఇచ్చినం.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఎంతమందికి సహాయం చేసావో చెప్పు?.. బటానీలు అమ్ముకునేటోళ్ళంత మంది కూడా మా మీటింగ్ కు రాలేదంటవా.. మరీ ఏందుకు నీ కంత ఉలికి పాటు. నీలాగ వందల బస్సులు, పైసలు పెట్టి సభలకు జనాన్ని తోలుకొస్తలేము. నిన్న నీ మీటింగ్ కు నలబై‌, యాబై వేల మంది రాలే. అధికారం ఉందని వెర్రివీగకు నీవు కేవలం అపధ్దర్మ సీఎంవి మాత్రమే గుర్తుపెట్టుకో.’ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

చదవండి: బుడ్డర్‌ఖాన్లలాగా కత్తులు తిప్పిన్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement