తాజ్‌కృష్ణకు కర్ణాటక ఎమ్మెల్యేలు

Congress-JDS MLAs Reaches Hotel In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దాదాపు 76 మంది ఎమ్మెల్యేలు బంజారాహిల్స్‌లో తాజ్‌ కృష్ణా హోటల్‌లో బస చేయనున్నారు. కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష వరకూ వారు ఇక్కడే బస చేస్తారని తెలిసింది. ఎమ్మెల్యేలందరికి 76 గదులు కేటాయించినట్లు తెలిసింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. మొత్తం హైదరాబాద్‌లోని రెండు హోటళ్లలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు.మొత్తం అందరూ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్‌కు చేరుకున్నట్లు కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే సంఖ్య చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తాజ్‌కృష్ణ హోటల్‌ వద్దకే జేడీఎస్‌ ఎమ్మెల్యేల బస్సు చేరుకుంది. 36 మంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే బస చేయనున్నారు.

మిస్సింగ్‌ అని అనుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తర్వలో వారు కూడా హైదరాబాద్‌ చేరుకుంటారని వెల్లడించారు. జేడీఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు నగరంలోని మరో హోటల్‌కు చేరుకుంటారని తెలిసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top