కరోనా కట్టడిపై ప్రధానికి సలహాలిచ్చా | Chandrababu Comments On Covid-19 | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడిపై ప్రధానికి సలహాలిచ్చా

Apr 15 2020 4:31 AM | Updated on Apr 15 2020 4:31 AM

Chandrababu Comments On Covid-19  - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణపై ప్రధాని మోదీకి తాను సలహాలిచ్చానని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చెప్పారు. దేశంలో ఇంకా టెస్టులు ఎక్కువ చేయాలని సూచించానన్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

► మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. కరోనాపై నేను చేసిన అధ్యయనాలను ఆయనకు వివరించా. 
► కరోనా కట్టడికి ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశామని, సాంకేతిక సాయం ద్వారా ప్రజలకు అందుబాటులో విజ్ఞానం ఉంచటమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పాను. 
► రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించాలని ఈ నెల 10వ తేదీన ప్రధానికి లేఖ రాశా.  
► లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ప్రధాని ప్రతిపాదించిన ఏడు సూత్రాలను అందరూ పాటించాలి. 
► ప్రభుత్వాలకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని తెలుసు, ఈ సమయంలో రాజకీయం చేయట్లేదు.  
► సమష్టిగా పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఏంచేయాలో చర్చించాలి. 
► దేశంలో లాక్‌డౌన్‌ తర్వాత 70 శాతం కరోనా కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాబ్‌ల సంఖ్య తక్కువ ఉంది. వాటిని ఇంకా పెంచాలి. 
► రాష్ట్రంలో అధికార యంత్రాంగం స్పందించి నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయాలి.  
► కొత్తగా వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పడం సరికాదు. 

ఏపీ కార్మికులను ఆదుకోవాలి
లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో తమిళనాడులో ఉన్న ఏపీ కార్మికులను ఆదుకునే చర్యలను కొనసాగించాలని చంద్రబాబు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను కోరుతూ లేఖ రాశారు. కార్మికులకు అవసరమైన షెల్టర్‌ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇదే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మరో లేఖ రాశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement