కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్‌ | BSP MLA To Skip Floor Test In Karnataka Tomorrow | Sakshi
Sakshi News home page

కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్‌

Jul 21 2019 3:36 PM | Updated on Jul 21 2019 3:47 PM

BSP MLA To Skip Floor Test In Karnataka Tomorrow - Sakshi

కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్‌

బెంగళూర్‌ : రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలతో విశ్వాస గండం ఎదుర్కొంటున్న కర్ణాటకలోని పాలక జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ప్రకటించిన బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ప్రస్తుతం యూటర్న్‌ తీసుకున్నారు. సోమవారం జరిగే విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తనను బీఎస్పీ చీఫ్‌ మాయావతి కోరారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్‌ మహేష్‌ వెల్లడించారు.

తాను బీఎస్పీ హైకమాండ్‌ ఆదేశాలకు అనుగుణంగా సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని, తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక విశ్వాస తీర్మానంపై సోమ, మంగళవారాల్లో ఓటింగ్‌ జరగనుండటంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సంకీర్ణ నేతలు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే అధికార మార్పిడి ఖాయమని ఆశల్లో ఉన్న బీజేపీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలకు పదునుపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement