‘టీఆర్‌ఎస్‌ ఎన్ని గెలిచినా లాభం లేదు’

BJP MP Candidate Raghunandhan Rao Slams KTR In Sadasivpet - Sakshi

మెదక్‌: కనీస జ్ఞానం లేకుండా కేటీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం తగదని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రఘునందన్‌ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వడం నరేంద్ర మోదీకి ఇష్టం లేదని కేటీఆర్‌ అనడం అవాస్తవమన్నారు. నాడు పోలవరానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జాతీయ హోదా ఇచ్చారని, ఆ సమయంలో ప్రధానిగా నరేంద్ర మోదీ లేరని కేటీఆర్‌ తెలుసుకోవాలని హితవు పలికారు.

టీఆర్‌ఎస్‌ ఎన్ని సీట్లు గెలిచినా తెలంగాణ రాష్ట్రానికి లాభం లేదని చెప్పారు. ఈ సారి మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలంతా ఇప్పుడు  బీజేపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top