గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ | BJP Clean Sweeps Gujarat In Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌

May 23 2019 4:41 PM | Updated on May 23 2019 4:41 PM

BJP Clean Sweeps Gujarat In Lok Sabha Elections - Sakshi

గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌

గాంధీనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో సత్తా చాటింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాల సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాషాయదళం క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ గతంలో ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌లో అమిత్‌ షా 3.27 లక్షల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్ధానాల్లోనూ బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. మరోవైపు ఈనెల 29న మరోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరవుతారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement