సీఎం ఆగ్రహం.. అమెరికాలో ఏమైంది? | Bihar CM Nitish Kumar Fires On Journalist | Sakshi
Sakshi News home page

సీఎం ఆగ్రహం.. అమెరికాలో ఏమైంది?

Oct 2 2019 10:51 AM | Updated on Oct 2 2019 11:06 AM

Bihar CM Nitish Kumar Fires On Journalist - Sakshi

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఆగ్రహం కట్టలుతెంచ్చుకుంది. పట్నా సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న ఓ విలేకర్లు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి  ఏంటని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులపైకి సీఎం ఒంటికాలిమీద లేశారు. వరదలు సంభవించినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురుకావడం సహజమన్నారు. గతంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు అమెరికాలో ఏమైంది?, ముంబైలో ఏమైంది? అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేస్తుందో కనీసం అవగాహన లేకుండా మాట్లాడవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టేందుకు, బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోందని వివరించారు. కాగా భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.  ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement