
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీలో ఇంకా కుర్రతనమే కనిపిస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన, రాహుల్‌లో ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదన్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, బీజేపీ మాత్రం అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తుందన్నారు. బీసీ బిల్లుతో పాటు ఎస్సీ, ఎస్టీ బిల్లులు ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందడం చరిత్రాత్మకమన్నారు. రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నా, భూముల విషయంలో కేంద్రం తాత్సారం చేస్తుందంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. నాలుగేళ్ల పాలన లో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు నీరు అందించలేదన్నారు.