అమిత్‌షా పోటీ చేసినా మేమే గెలుస్తాం..! | Asaduddin Says We Will Defeat BJP | Sakshi
Sakshi News home page

అమిత్‌షా పోటీ చేసినా మేమే గెలుస్తాం..!

Sep 15 2018 4:53 PM | Updated on Sep 15 2018 4:58 PM

Asaduddin Says We Will Defeat BJP - Sakshi

ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఓటమిపాలవుతుందని..

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీ చేసినా తామే గెలుస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఓటమిపాలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అమిత్‌ షా శనివారం తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒవైసీ ట్విటర్‌ వేదికగా అమిత్‌ షాను విమర్శించారు. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు, నిరుద్యోగ సమస్యకు బీజేపీ వద్ద ఎలాంటి సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. కాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా శనివారం తెలంగాణ పర్యటకు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement