
భూసేకరణ అంటే ఏమిటి?
భూసేకరణ చేసినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు మరచిపోయి భూమి కోల్పోయిన వారిని సర్కారీ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్న తీరు ఆర్టీఐ రెండో అప్పీలు రూపంలో ఎన్నోసార్ల్లు ముందుకు వస్తున్నది.
మాడభూషి శ్రీధర్
భూసేకరణ చేసినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు మరచిపోయి భూమి కోల్పోయిన వారిని సర్కారీ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్న తీరు ఆర్టీఐ రెండో అప్పీలు రూపంలో ఎన్నోసార్ల్లు ముందుకు వస్తున్నది.
‘భూమి నాదన్న భూ మి ఫక్కున నవ్వు’ అని ఒక నానుడి ఉంది. సర్కారు వారు పౌరుడి భూమి కావాలని సంక ల్పిస్తే, అతడికి కష్టాలు మొదలవుతాయి. భూ మి నాది అనే మాట పో యి భూమి ఏది, ఎక్కడ అంటూ ఆందోళన కలుగుతుంది. శతాబ్దం కింద విదేశీ పాలకులు తమకు అనుకూలంగా చేసుకున్న భూమి స్వాధీన (మనం మర్యాదగా భూసేకరణ అంటున్నాం) చట్టాలను స్వతంత్ర దేశం ఇంకా అమలు చేసుకుంటూ ఉండడం సిగ్గ్గుచేటు. చిన్న రైతుల జీవితాల్లో తుపాన్లు సృష్టించి ఈ భూసే కరణ ఆర్థిక జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. అధి కారుల చేతుల్లో భూమిని, జరుగుబాటును కూడా పూర్తిగా కోల్పోయి రైతు బికారి అవుతున్నాడు. విదేశాల నుంచి వచ్చి ఎవడో ఏకే 47తో చంపే పని లేదు. భూసేకరణ చేస్తే చాలు. దీన్ని భూఉగ్ర వాదం అని పిలవడం లేదు. ప్రభుత్వోద్యోగులు పాలన సరిగ్గా చేస్తున్నారో లేదో తెలియదు కాని భూసేకరణ చేసినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు మా త్రం అతి దారుణంగా మరచిపోయి భూమి కోల్పో యిన వారిని సర్కారీ కార్యాలయాల చుట్టూ తిప్పు కుంటూ వేధిస్తున్న తీరు ఆర్టీఐ రెండో అప్పీలు రూపంలో ఎన్నోసార్ల్లు ముందుకు వస్తున్నది.
ఎవరి భూమిని ఏ ప్రయోజనం కోసం సర్కా రు రూపంలో ఎవరు హరిస్తారో తెలియదు. రాజు లను భూపతులు అని పిలుస్తారు. మన ప్రజా స్వామ్య పాలకులు భూమిని సొంతం చేసుకోవ డంలో అనుసరించే పద్ధతులు, దానికి చట్టాన్ని వాడుకునే వ్యూహాలు, చివరకు స్టేట్‌ను రియల్ ఎస్టేట్‌గా మార్చే పథకాలు సామాన్యంగా అర్థం కావు. కనుక భూసేకరణ అంటే అర్థం భూదోపి డీగా మారిపోయిందనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. విచిత్రమేమంటే భూమిని ఎట్లాగూ కాపాడుకోలేని సామాన్యుడు తన భూమి ఎప్పుడు సేకరించారు లేదా సమీకరించారు లేదా స్వాధీనం చేసుకు న్నారో తెలియనిస్థితిలో ఉన్నాడు. అంతేకాదు ఎంత భూమిని తీసుకున్నారు? దాని నోటిఫికేషన్ ఏమిటి? తీసుకున్న భూమి హద్దులేమిటి? దానికి పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఎంత, ఎవరు ఇస్తారు? అనే కనీస సమాచారం కూడా ఒకనాటి భూయజమానులకు ఇచ్చేవారు లేరు. ఆర్టీఐ కింద తప్ప వారిని అడిగే మరో వ్యవస్థే లేదు.
లాజిందర్ సింగ్ వయసు 77 సంవత్సరాలు. అతను ఒకప్పుడు భూమి కలిగి వ్యవసాయం చేసు కుంటూ పది మందికి సాయం చేసే స్థితిలో ఉండే వాడు సర్కారు వారు 37 ఏళ్ల కిందట అతని భూమిని లాక్కునే వరకు. ఢిల్ల్లీ దగ్గర కిర్కీ అనే ఊళ్లో తనకు చెందిన భూమి ఎంత, ఎప్పుడు తీసు కున్నారు, స్వాధీనం చేసుకున్న తేదీ రికార్డు ఇవ్వం డి, స్వాధీనం చేసుకున్న అధికారి పేరు చెప్పండి అని లాజిందర్ సింగ్ అడిగారు. జన్ సూచనా అధికారి (ప్రజా సమాచార అధికారి, పీఐఓ) ఆ తరువాత ప్రథమ అప్పీలు అధికారి తామిచ్చిన సమాచారంతో పూర్తిగా సంతృప్తి చెందారు. కానీ లాజిందర్‌కు కావలసిన సమాచారం దొరకలేదని కమిషన్ తలుపు తట్టాడు.
1978లో 18 బీగాల భూమిని తీసుకున్నారనీ, ఇంతవరకు తనకు గానీ తన తండ్రికి గానీ నష్టపరిహారం చెల్లించలేదనీ అతను బాధ చెప్పుకున్నాడు. భూసేకరణ కలెక్టర్, ఢిల్ల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీఏఏ), భూమి భవనాల (ఎల్ అండ్ బీ) విభాగం అనే మూడు ప్రభుత్వ శాఖలున్నాయి. సర్కారు వారంతా ఈ సేకరణ సమాచారం భూసేకరణ ఆఫీసులో ఉం దని అంటారు. వారేమో మేమిదివరకే సేకరించి ఎల్ అండ్ బీ శాఖకు భూమిని అప్పగించాం, మాదగ్గర ఏమీలేదు, ఎల్ అండ్ బీ శాఖను అడగం డి అంటారు. ఆ సంగతి డీఏఏకే తెలుసని ఎల్ అండ్ బీ అంటుంది. లాజిందర్ మూడు కార్యా యాల్లో ఆర్టీఐ దాఖలు చేయడం, వారు ఒకరి నుం చి మరొకరికి బదిలీ చేయడం, ఈయన ఎక్కడ మొదటి అప్పీలు వేసుకున్నా ఇక్కడ కాదు నీవు వారి మొదటి అప్పీలు అధికారి దగ్గర వేయాలన డం జరిగిపోతూ ఉన్నది. ఈ మూడు శాఖల డీఏఏ లు ముగ్గ్గురికీ సమన్లు జారీ చేయడం జరిగింది. అప్పుడు తెలిసిందేమంటే... రెండు నెలల తరు వాత మొదటి అప్పీలు అధికారి డీఏఏ వారు ఎల్ అండ్ బీకు రాసిన ఉత్తరాల నకళ్లు లాజిందర్‌కు ఇవ్వాలని ఆదేశించారు. దానికో తిరకాసు పెట్టాడా రెవెన్యూ నిపుణుడు. ఆ ఫైళ్లు దొరికితే... అని. అంతే ఫైళ్లు దొరికాయో లేదో చెప్పరు. సమాచారం ఇస్తారో లేదో చెప్పరు. ఇదొక చట్టవ్యతిరేక ఉత్త ర్వు. ైఫైళ్లు దొరికితే ఇవ్వండి అంటే దొరకలేదని చెప్పండి అని ఆదేశం. అతీగతీ లేదు.
ఢిల్లీ భూసేకరణకు 1961లో పథకం వేశారు. నజుల్ భూనియమాలు మార్చారు. భూమిని కోల్పోయిన వారికి పరిహారంతో పాటు ప్రత్యా మ్నాయంగా ప్లాట్లు ఇస్తామన్నారు. 1986 పథకం నియమాలు మార్చారు. ఇతనికి పరిహారమూ లేదు, ప్రత్యామ్నాయ భూమీ లేదు. ప్రత్యామ్నా య భూమిలో కూడా చాలా తిరకాసులున్నాయి. అది కేటాయించిన నాడు సర్కారు నిర్ధారించిన రేటుకు భూమిని కోల్పోయిన వ్యక్తి కొనుక్కోవాలి. 1978లో భూమి తీసుకున్న రేటుకు పరిహారం 2015 లోనూ ఇవ్వరు. ఇస్తే 1978 నాటి రేటు లెక్కించి తక్కువ డబ్బు ఇస్తారు. కానీ 2015లో ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయిస్తే ఇప్పటి రేటుకు ఆ రైతు ప్లాట్లు కొనుక్కోవాలి. ఇదెక్కడి న్యాయం?
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com