చెడులోనూ దాగి ఉన్న మంచి?

చెడులోనూ దాగి ఉన్న మంచి? - Sakshi


విశ్లేషణ

 

ప్రజలు నీటికోసం అల్లాడుతున్నందున నాచు కలిసిన, మురికి నీళ్లు తీసు కొచ్చినా ఖర్చయిపోతాయి. తమకు రావాల్సిన వాటా నీటిని పొందన ప్పుడు దొరికే ప్రతి నీటి బిందువుకూ తనదైన లెక్క ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో బ్రాండెడ్ నీటి బాటిల్‌కు బ్లాక్ మార్కెట్ రేటు పలుకుతుంది.

 

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పి. సాయినాథ్ 1999లో రచించిన ‘ఎవ్రీ బడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్’ నిరంతరం సవరించి లేదా కొత్త పేరుతో ప్రచు రించదగిన విశిష్ట రచన. ఎందుకంటే భారత సమా జానికి సంబంధించిన ఘోరాతి ఘోరమైన రహస్యాల మేలిముసుగును ఆయన ఈ పుస్తకంలో విప్పి చెప్పినప్పటికీ ఈ దేశం తన మార్గాన్ని మార్చు కోవడం గురించి పాఠాలు నేర్చుకోలేదు. ఆ పుస్త కంలో వివరించిన వాటికంటే ఇంకా అన్వేషించ వలసిన అవమానకరమైన అంశాలు దేశంలో అనేకం ఉన్నాయి. గత బుధవారం వరకు మహా రాష్ట్రలో 29,600 గ్రామాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం వీటిలో ఒకటి.



కరువు ప్రకటన అనేది నిబంధనలను క్రియా శీలం చేయవలసిన అవసరాన్ని ముందుకు తీసుకు వస్తుంది. అంతకంటే ముందు ప్రభుత్వం కేంద్ర నిధులకోసం ప్రయత్నించడంపై తన ఉద్దేశాన్ని సూచిస్తుంది. విచిత్రం ఏమిటంటే కరువు ఉపశమన చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దం పాటిస్తూ, ప్రభుత్వ భాగస్వామి అయిన శివసేనను కరువుపై గావుకేకలు వేయడానికి అనుమతిస్తోంది. వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్రచారాంశంగా మలుచుకోవడానికి గానూ ప్రజల బాధలపట్ల ప్రతిపక్షం అనుసరించ వలసిన పద్ధతి ఇదేనా?



తాగునీరు లేనప్పుడు, పంటలు పండన ప్పుడు, ప్రభుత్వం ఎందుకు వేచి ఉంటోందన్నది మాయగా ఉంది. ఉడిగిపోయిన పశువులను రైతులు కబేళాలకు అప్పగించకుండా నిషేధం విధిం చడం వల్ల వారిపై ఆర్థిక భారం మరింతగా పెరుగు తోంది. మూర్ఖులు మాత్రమే గ్రామీణ ఆర్థిక వ్యవ స్థను ఇలాంటి ప్రయత్నాలతో ఆటంకపర్చే విష యంలో విజ్ఞతను చూడగలరు. పాలనిచ్చే పశువులు కూడా పశుగ్రాసం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో గడ్డి లేక అవి కూడా వట్టిపోయాయి.



డబ్బు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నీటి కొరత కోసం సంసిద్ధంగా ఉంటున్న ప్రైవేట్ రంగం సన్నాహక చర్యలతో కరువుపై ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనను పోల్చి చూడండి. నీటి కొరత తీవ్రత గురించిన సమాచారం అందుకున్న వెంటనే ప్రైవేట్ యజమానులు ధరపెట్టి మరీ అమ్మడం కోసం కొత్త నీటి ట్యాంకర్లను కొనేశారు. ఒక్క థానే జిల్లాలోనే 500 కొత్త నీటి ట్యాంకర్లను నమోదు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తనదైన పద్ధతుల్లో వ్యవహరిస్తూ పోయింది.



ప్రైవేట్ ట్యాంకర్లు తీసుకొస్తున్న నీటి వనరుల మూలం గురించీ లేదా నీటి నాణ్యత గురించి పట్టిం చుకోవద్దు కానీ నీటి అమ్మకాల్లోని భారీ లాభాలను పెరిగిన ట్యాంకర్ల సంఖ్యే సూచిస్తోంది. ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు కాబట్టి నాచు కలిసిన, మురికి నీళ్లు తీసుకొచ్చినా అవి ఖర్చయిపోతాయి. తమకు రావలసిన వాటా నీటిని (అది కూడా వారి కనీస అవసరాలకంటే తక్కువే) పొందలేనప్పుడు దొరికే ప్రతి నీటి బిందువుకూ తనదైన లెక్క ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో బ్రాండెడ్ నీటి బాటిల్ బ్లాక్ మార్కెట్ రేట్లతో అమ్ముడవుతుంది.



మరొక రోజు ఒక చిన్న రైల్వే రిజర్వాయర్ నుంచి నీటిని తోడుకుని వస్తున్న ఒక ట్యాంకర్ దొరికింది. ఆ నీటిని అమ్మితే ట్యాంకర్ యజమానికి రూ.800లు వస్తుంది. అంటే అమ్మిన ఈ ఉత్పత్తి చౌర్యానికి గురయిన ఉత్పత్తి అన్నమాట. ఇలాగే రైల్వే వ్యాగన్లు ప్రారంభంలో లాతూర్‌కు నీటిని తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారం దానిలోకి జొరబడాలని చూసింది. ఇలాంటి కార్యకలాపాలను ట్యాంకర్ మాఫియా అని పిలుస్తున్నారు. సంవత్సరాలుగా వీళ్లు నగ రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి చెందుతూ వస్తు న్నారు. పరిశ్రమ అవసరాలకోసం డబ్బు తీసుకుని మరీ అధికారులు ట్యాంకర్లలో నీటి పంపిణీ చేస్తున్న తతంగాన్ని ఇటీవలే టీవీలు స్ట్రింగ్ ఆపరేషన్‌ల ద్వారా చూపించాయి కూడా.



ఉపాధితో అనుసంధానమై ఉంది కనుక పరిశ్ర మలకు నీటి సరఫరా అవసరమైనదే కానీ బీర్ తయారీదారులకు నీటి సరఫరాను తగ్గించవల సిందిగా కోర్టులు ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చి ంది. నీటి ధరవరలను పోల్చి చెబుతూ మరాఠీ వార్తా పత్రిక లోక్‌సత్తా  తెలిపిన వివరాలు దిగ్భ్రాం తి కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల, 13 లీటర్ల కుండ లేదా పాత్రలోని నీళ్లను ప్రైవేట్ నీటి వ్యాపారుల వద్ద కొంటే ఐదు రూపాయలు ఖర్చవుతోంది. కానీ మద్యపానీయ తయారీదారులు అదే నీటికి లీట ర్‌కు నాలుగు పైసల చొప్పున చెల్లిస్తున్నారు.



లాతూర్‌లో 6 వేల లీటర్లు పట్టే ట్యాంకర్ నీటికి రూ.1,300ల వెల పలుకుతోంది. అంటే లీటర్‌కు 22 పైసలు అన్నమాట. ప్రభుత్వ ట్యాంకర్ నీటిని ఉచితంగా ఇచ్చినప్పటికీ దాని ఖరీదు మాత్రం లీటర్‌కు 30 పైసలు పడుతోంది. అందుకే నిర్దిష్టై మెన నీటి రంగం మరింత సమర్థవంతమైనదని ఇది తెలుపుతోంది. అయితే బేరసారాల్లో భాగంగా ప్రభుత్వం నీటి ప్రైవేటీకరణను అనుమ తించింది. మాఫియా కనుక రంగంలోకి దిగకపోతే, నీటి దాడులు జరిగే ప్రమాదం ఉంది. అంటే చెడులో కూడా మంచి అంశాలున్నాయన్నమాట. వింతైన విషయమే కావచ్చు కాని ఇది నిజం.

 

- మహేష్ విజాపుర్కార్

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు

 ఈమెయిల్: mvijapurkar@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top