గ్రహం అనుగ్రహం
గ్రహం అనుగ్రహం
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం, తిథి బ.నవమి ఉ.6.20 వరకు, తదుపరి దశమి రా.3.54 వరకు
నక్షత్రం అశ్వని రా.2.33 వరకు, వర్జ్యం రా.10.48 నుంచి 12.20 వరకు
దుర్ముహూర్తం ప.11.36 నుంచి 12.26 వరకు, అమృతఘడియలు రా.7.50
నుంచి 9.20 వరకు
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.36
రాహుకాలం: ప 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తు, వస్త్ర లాభాలు చేకూరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి.
వృషభం: పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
మిథునం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సింహం: మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వృథా ఖర్చులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. దైవ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు. భూలాభాలు. యత్న కార్యసిద్ధి. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత నెలకొంటుంది.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వాహనయోగం. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: మిత్రులతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: వ్యయ ప్రయాసలు. దుబారా వ్యయం చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో తగాదాలు రావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం కలుగుతుంది.
కుంభం: పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మీనం: దూరప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు


