గ్రహం అనుగ్రహం
శ్రీమన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం
శ్రీమన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.చతుర్దశి ఉ.10.11 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం శతభిషం రా.12.01 వరకు, వర్జ్యం ఉ.8.00 నుంచి 9.22 వరకు, దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.30 వరకు, తదుపరి రా.10.47 నుంచి 11.37వరకు, అమృతఘడియలు సా.5.11 నుంచి 6.44 వరకు
సూర్యోదయం : 6.18
సూర్యాస్తమయం: 6.04
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: పరిచయాలు పెరుగుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తు, వస్త్ర లాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు ్ఞఅందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మిథునం: పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు. పనుల్లో అవరోధాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు.
సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం అవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
తుల: వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: పనులు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనారోగ్యం. బంధువర్గంతో వైరం. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
- సింహంభట్ల సుబ్బారావు


