అవినీతి వ్యతిరేక క్రూసేడర్‌నంటూ అన్నా హజారే జన్‌లోక్ పాల్ ఉద్యమ కాలంలో తెగ ఊదరగొట్టిన నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా రాజకీయ అవినీతికి చిరునామాగా తేలారు.
అవినీతి వ్యతిరేక క్రూసేడర్‌నంటూ అన్నా హజారే జన్‌లోక్ పాల్ ఉద్యమ కాలంలో తెగ ఊదరగొట్టిన నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా రాజకీయ అవినీతికి చిరునామాగా తేలారు. ప్రొద్దున లేచిన దగ్గర నుండి వాడు దొంగ, వీడు దొం గ అంటూ నానా గోల చేసే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కన్నం లో దొరికిన దొంగ. అది కూడా ఆయనా, ఆయన అను యాయులూ నిత్యం దుమ్మెత్తి పోసే తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ‘కన్నం’ వేస్తూ కలు గులో చిక్కారు.
దీంతో బాబు రాజకీయ అవినీతి ఘనత ఏకంగా అంతర్జాతీయస్థాయికి చేరింది. మామను ఏమా ర్చి టీడీపీని హైజాక్ చేసినట్టు చట్టం, న్యాయవ్యవస్థలతో వ్యవ హరించడం సాధ్యం కాదు. ఈ కేసులోంచి బయటపడటం కోసం బాబు ‘ఏమైనా’ చేయాలని తెగ సమాలోచనలు చేస్తు న్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య స్పర్థలను సృష్టించాలని, కేసీఆర్, టీఆర్‌ఎస్‌లపై ఎదురు దాడికి దిగాలని యత్నించడం ఆయనకే బెడిసికొడతాయి. ఇప్పటికైనా చేసిన తప్పుకు లెంపలే సుకుని, తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్నీ క్షమించ మని వేడుకోవడం నయం. కానీ బాబు తీరును చూస్తే ఆయ న్ను కటకటాల వెనుక చూడక తప్పేలా లేదు.
- డి.ఎమ్. రాజు విజయవాడ