ఆప్.. ఆర్టీఐ.. అరవింద్ | .. .. Arvind of RTI | Sakshi
Sakshi News home page

ఆప్.. ఆర్టీఐ.. అరవింద్

Feb 13 2015 1:54 AM | Updated on Sep 2 2017 9:12 PM

ఆప్.. ఆర్టీఐ.. అరవింద్

ఆప్.. ఆర్టీఐ.. అరవింద్

రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ప్రతి పార్టీ ఒక ఆర్టీఐ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయరాదు?

రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ప్రతి పార్టీ ఒక ఆర్టీఐ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయరాదు?
 
ఢిల్లీ ప్రజానీకం అవినీతికి వ్యతిరేకంగా మాడు పగిలే తీర్పిచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. సమా చార హక్కు అనే అస్త్రంతో మంచి పాలన సాధించుకోవ చ్చునని పోరాడి నిరూపించిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంతటి అపూర్వ ఆధిక్యాన్ని ఇచ్చారంటే దాని అర్థం- అవినీతి లేని పాలనను ఇవ్వమనే! అందుకు సహ చట్టాన్ని వినియోగించుకోమని ఆదేశం. లంచాల ద్వారా అక్రమా ర్జన మాత్రమే అవినీతి కాదు. నీతి నియమాలు లేని రాజకీయాలూ అవినీతే. ఓటును అమ్ముకుని, ఆ డబ్బు తో తాగి భార్యను కొట్టే ప్రతి భర్తా అవినీతిపరుడే.

ఒక రాజకీయ పక్షంలో చేరి, ఆ సిద్ధాంతాన్ని విశ్వసించినట్టు నటించి ఎన్నికలలో ఆ పార్టీ గుర్తు మీద గెలిచి, పదవులు పొంది, డబ్బు సంపాదించేవారు; ఆ పార్టీకి ఆదరణ తగ్గిందని, గెలిచే పార్టీ అనుకొన్నదానిలోకి ఫిరాయించే వ్యక్తులు ప్రమాదకరమైన అవకాశవాదులు. ఢిల్లీ ఎన్నిక ల తేదీలు ప్రకటించిన తరువాత పార్టీలు మార్చిన ము గ్గురు మహిళలను ఓటర్లు తిరస్కరించారు. 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 67 స్థానాలను ఇంతవరకు ఏ రాష్ట్రం లోనూ, ఎప్పుడూ ఒకే పార్టీకి జనం ఇవ్వలేదు. మొన్నటి దాకా మీరే దుమ్మెత్తిపోసిన పార్టీలో కలసి పదవులు సంపాదించి మీరు చేసేదేమిటని కిరణ్ బేడీ, ఇల్మీ, కృష్ణ తీర్థలను జనం నిలదీశారు- ఈ తీర్పుతో. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లనే ఓటర్లు ఇతర పార్టీ లను తిరస్కరించి, తమకు ఓటు వేశారన్న వాస్తవాన్ని ఆప్ గుర్తించాలి. తమకు తిరుగేలేదన్న రీతిలో ప్రదర్శిం చిన దురహంకారానికి ఈ తీర్పు ఒక సమాధానం. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే, అది నిరాశగా, నిస్పృహగా, జనాగ్రహంగా మారుతుందని, ఢిల్లీ తీర్పు అలాంటి పరిణామమేనని కూడా ఆప్ గుర్తుంచుకోవాలి.
 
కేజ్రీవాల్ సమాచార హక్కుతో ప్రజాజీవనంలోకి ప్రవేశించారు. కాబట్టి ఆ హక్కుతో రాజకీయాలు మారు తున్నాయని, ఢిల్లీ తీర్పుతో ఆయన గుర్తించడం అవస రం. ఆప్ పరిపాలన అర్ధాంతరంగా 49 రోజులకే ముగిసి ఉండవచ్చు. అయినా ఆ స్వల్ప వ్యవధిలోనే అవినీతి రహిత, పారదర్శకత నిండిన, స్వచ్ఛమైన పాలన వచ్చిం దన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. హఫ్తా వసూళ్లు ఆగిపోయాయన్న విషయమూ వారికి గుర్తుం ది. అలాంటి పాలన ఐదేళ్లు సాగాలని ఆశించే, ఓటర్లు 67 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఆ హక్కును ఇప్పుడు ఆప్ ఏ రీతిలోగౌరవిస్తుందనేది అంతా వేసుకుంటున్న ప్రశ్న.

రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండా లి. కాబట్టి ప్రతి పార్టీ ఒక ఆర్టీఐ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయరాదు? పార్టీకి ఆదాయం ఎక్కడ నుంచి వచ్చిందో, ఎంత వచ్చిందో, ఏవిధంగా ఖర్చయిందో వెల్లడించవలసిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉన్నది. ఎన్నికలు ముగిసిన తరువాత ఈ వివరాలను నిర్ణీత కాలంలో పార్టీలే ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని చట్టం నిర్దేశిస్తున్నది కూడా. ఎన్నికలలో గెలిచినా, ఓడినా అభ్యర్థులంతా ఈ వివరాలను సమర్పించవలసిందే. ఈ లెక్కలను ఆదాయపు పన్ను శాఖకే కాదు, ప్రజలకూ విన్నవించాలి. ఈ వాస్తవాలను తెలుసుకునే హక్కు వారి కి ఉంది. రాజకీయ అవినీతిని నిర్మూలించే కృషిలో కొత్త అధ్యాయం ఈ చర్యలతోనే ఆరంభం అవుతుంది. ఈ కృషికి ఆప్ శ్రీకారం చుట్టి, మిగిలిన రాజకీయ పార్టీలకు మార్గదర్శకం కావాలి.
 
ఆప్‌కు అనుమానాస్పదులైన వ్యక్తుల నుంచి విరా ళాలు అందినట్టు అనుమానంగా ఉందనీ, ఆ విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు తెలియచేయాలని ఆదాయ పన్ను శాఖ తాఖీదులు ఇచ్చింది. నిజానికి ఆ శాఖకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా అలాంటి వివరాలను వెల్లడించవలసిన బాధ్యత ఆప్ మీద ఉంది.
 
ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా మలచాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆప్ కేంద్ర ప్రభు త్వాన్ని కోరుతోంది. దేశ రాజధాని నగరంగా ఢిల్లీకి ప్రత్యేకత ఉన్నా, పూర్తి స్థాయి రాష్ట్ర హోదా మాత్రం లేదు. అంటే కేజ్రీవాల్ మేయర్ కన్నా కాస్త ఎక్కువ. ముఖ్యమంత్రి కన్నా చాలా తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణలో కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు. అవి కేంద్రం చేతిలోనే ఉన్నాయి. లెఫ్టి నెంట్ గవర్నర్‌ను పాలకునిగా నియమించి, అన్ని అధికారాలు కట్టబెట్టారు. ఇది కేజ్రీవాల్ ఎదుట ఉన్న పెద్ద సవాలు. రాజ్యాంగాన్ని సవరించి, ఢిల్లీని పూర్తిస్థా యి రాష్ట్రంగా ప్రకటించే అధికారం శాసనసభకు లేదు.
 
ఒక సమాచార కమిషన్‌ను ఏర్పాటుచేసి, పది మంది కమిషనర్లతో సమాచార హక్కు రెండో అప్పీళ్లను ఎప్పటికప్పుడు విచారించే వ్యవస్థను ఏర్పాటు చేసే సాహసం ఢిల్లీలో ఏర్పడబోతున్న కొత్త ప్రభుత్వం చేయ గలదా? ఈ కమిషన ర్లకు సహాయకులను కూడా నియ మించగలదా? కమిషనర్ ఇచ్చిన తీర్పును అమలు చేయవలసిందేనని చట్టం చెబుతోంది. కాబట్టి అలాంటి తీర్పు మీద అన్ని సందర్భాలలోను ప్రభుత్వం హైకోర్టు కు వెళ్లకుండా ఉండగ లదా? ప్రైవేటు పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు, వైద్యశాలలను; ప్రైవేటు బ్యాంకులు, సహకార సంస్థలు, బీమా సంస్థలను సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వవలసిన సంస్థలుగా ఆప్ నేత, ఆర్టీఐ ఉద్యమకారుడు కేజ్రీవాల్ ప్రకటించగలరా? ఆ విధంగా ఉత్తమ పాలనకు బాటలు వేయగలరా? వేచి చూడవలసిందే.
 
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement