చికాగోలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Telangana State Formation Day Celebrated NRIs In Chicago - Sakshi

చికాగో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చికాగోలోని సౌత్‌ బారింగ్టన్‌లోని అమెరికా తెలంగాణ సంస్థ (ఆటా) ఆధ్వర్యంలో ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను ఈ సంస్థ ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి లెంకల స్వాగత చిరునామాతో ఆరంభించగా, సత్య నారాయణ కండిమల్ల, కరుణాకర్ మాధవరం, శ్రీనివాస్ రెడ్డి చాడ, నరేందర్ రెడ్డి చిమర్ల, కళ్యాణ్ ఆనందుల, శ్రీనివాస రెడ్డి గజ్జి జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నారి శ్లోక అనందుల గణేష్ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అర్పించిన అమరులకు నివాళిగా నిశ్శబ్దం పాటించారు. 

అమెరికా తెలంగాణ సంస్థ అధ్యక్షుడు సత్య కందిమళ్ల.. వేడుకకు హాజరైన అథితులకు మరియు తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావ శుభకాంక్షలు తెలిపారు. ఈ నెల 29, 30, జూలై 1 న హూస్టన్లో మహా నగరములోజరుపుకొంటున్న 2వ ప్రపంచ తెలంగాణ సమావేశానికి హాజరు కావాలని కోరారు. చైర్మన్ కరుణాకర్ మాట్లాడుతూ.. సంస్థ ఆవిర్భావ ప్రాముఖ్యత , రాష్ట్ర ఆవిర్భావానికి సంస్థ పాలుపంచుకున్న పలు కార్యక్రమాలు, రాష్ట్ర ఆవిర్భావం తరువాత బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యముతో సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలను, తెలంగాణ ప్రవాసీ విధి విధానాలు, విద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ప్రత్యేక సలహా కమిటీ సభ్యులు కళ్యాణ్ ఆనందుల, శ్రీనివాస్ చాడ, నరేందర్ చీమర్లా ప్రసంగిస్తూ...  ప్రపంచ తెలంగాణ మహాసభల ద్వారా మన సంస్క్రతి, కట్టుబాట్లను, మన కళ, భాషా మన భావి తరాలకు అందిస్తున్నామ్మని, ఈ 2వ ప్రపంచ తెలంగాణ సమావేశాలలో ప్రత్యేక ఆకర్షణీయమైన శ్రీ సీతారామ కళ్యాణం, మన రాష్ట్ర రాజకీయలు మన పాత్ర వేదిక, వాణిజ్య వేదికలు, ఉత్సవ అంగడుల (ఎక్జిబిట్స్) వంటి అంశాల గురించి వివరించారు.

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు పార్థు మాని నేతృత్వంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పాటల కచేరి కార్యక్రమం అతిథులను అలరించింది. చివరిగా నరేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక విభాగాలు, అమెరికా తెలంగాణ సంస్థకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రచార భాగస్వాములకు, హాజరైన అతిథులకు, ఈ కార్యక్రమానికి కష్టపడి పని చేసిన వాలంటీర్లుకి, ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచి, పక్కా ప్రణాళికతో విజయవంతం చేసిన అమెరికా తెలంగాణ సంస్థ ప్రచార కమిటీ చైర్మన్, రామచంద్ర రెడ్డి, ఏడేలకు ధన్యవాదాలు’ అంటూ కార్యక్రమాన్ని ముగించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top