లండన్‌లో తెరాస సభ్యుల మీట్‌ అండ్‌ గ్రీట్‌

KTSUK Celebrate the meet and Greet event in London

లండన్‌: కేటీఎస్‌యూకే(కేసీఆర్‌ తెరాస సపోర్టర్స్‌ ఆఫ్‌ యూకే) ‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం’ అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులోని భాగంగా కేటీఎస్‌యూకే ఆధ్వర్యంలో తెరాస సభ్యుల మీట్‌ అండ్‌ గ్రీట్‌ పేరుతో కార్యక్రమాన్ని లండన్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కొండా సురేఖ(టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే), కొండా మురళి, టి. ప్రకాష్‌ గౌడ్‌(ఎమ్మెల్సీ), గుండవరపు దేవీప్రసాద్‌( తెలంగాణ రాష్ట్ర బివరేజేస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌), తెరాస యుజన నాయకులు అరవింద్‌ గౌడ్‌లు విచ్చేశారు.

నగేష్‌ రెడ్డి కాసర్ల అధ్యక్షతన  ఈ కార్యక్రమం జరిగింది.‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం’ అనే నినాదంతో  అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నేతన్నకు భరోసా కల్పించడానికి   తమ వంతు సాయంగా చేస్తున్న కేటీఎస్‌యూకే  ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, అతిథులకు వివరించారు. కేటీఎస్‌యూకే అధ్యక్షులు సిక్కా చంద్ర శేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నా సమయం వేచించి కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వివిధ దేశాల్లో ఉన్న తెరాస ఎన్నారై టీ సభ్యులకు ఇస్తున్న ప్రోత్సాహనికి ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు బంగారు తెలంగాణ కోసం తాము వారి వెంట ఉంటామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా దేవి ప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేనేత ప్రమోషన్‌కు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నారైల అండదండాలు ఎప్పుడూ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేనేత పరిశ్రమ బాగుకోసం వినూత్న పథకాలతో తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఆలోచనలు ఎవరికి అందనంతా ఎత్తులో ఉన్నాయని, ఆయనతో పోటీ పడేవారు ఎవరూ లేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనాధ పిల్లల కోసం చదువు, వసతి తదితర అంశాలపై సీఎం చొరవ అభినందనీయమన్నారు.

ప్రకాష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ కోసం ఎన్నారైలు అందరూ ఎలాంటి సలహాలు, సందేహలు ఉన్న తెలపాలన్నారు. స్వచ్చ హైదరాబాద్‌ నగరాన్ని  పరిశుభ్రంగా చేయడానికి మాత్రమే సీఎం పరిమితం కాలేదు. ప్రతి బస్తీలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమంగా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చదిద్దే క్రమంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

కన్నా తల్లిని ఎలా మర్చిపోమో, పుట్టిన ఊరుకి వీలైనంత సహాయం చేయాలని కొండామురళి పిలుపునిచ్చారు. ప్రపంచలో ఎక్కడ లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు అనుమతి లభిస్తోందన్నారు. మిషన్‌ కాకతీయ మంచి ఫలితాలిస్తుందని, పునరుద్దరణ చేసిన చెరువులు నిండుకుండల్లా మరాయని చెప్పారు. ముఖ్య అతిథి, ఎమ్మెల్యే కొండా సురేఖ ఈ కార్యక్రమంలో తాను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చానని గుర్తు చేసుకున్నారు. చేనేత పరిశ్రమ ప్రత్యేకించి చేనేత రంగంలో తీసుకున్న నిర్ణయాలు- విధానాల గురించి సభకు వివరించారు. భవిష్యత్తులో వరంగల్‌లో రాబోయే చేనేత పరిశ్రమలు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నామని, అందరూ సహకరించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి మూడేళ్లలో టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందన్నారు. కార్యక్రమం అనంతరం ఎన్నారై.టి.ఆర్‌.ఎస్‌​ ప్రతినిధులు ముఖ్య అతినిధులను ఘనంగా సన్మానించారు.

బావార్చి రెస్టారంట్ అధినేత కిషోర్ కుమార్ మునుగంటి,శశి కొప్పుల, మహిళా విభాగం నందిని మొట్ట, రజిత నీల ,వర్ష కారిక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం నాయకులు అధ్యక్షులు రామ్ చెప్యాల ,శ్రీనివాస్ రెడ్డి పింగళి ,గౌడ్ బాయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సంస్థ సభ్యులు, తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top