గల్ఫ్‌ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాం

Jayaho Jagan Event Held In Kuwait - Sakshi

కువైట్‌ : వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ అభిమానుల ఆత్మీయ సమావేశం "జయహో జగన్" కార్యక్రమం సాల్మియా ప్రాంతంలోని ఇండియన్ మోడల్ స్కూల్ లో భారీగా జరిగింది. కడపకు చెందిన సాధిక్, ఇమ్రాన్, సజ్జాద్, రఫీ, ఫైరోజ్ ఆధ్వర్యములో వైకాపా కువైట్ కమిటీ సహాకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో  గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. జయహో జగన్ కార్యవర్గ సభ్యులకు కువైట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కువైట్ కమిటీ వైఎస్సార్‌సీపీ అభ్యున్నితికి ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని వివరించారు. కమిటీ సభ్యుల సహాకారంతో చేస్తున్న సామాజిక సేవల గురించి వివరిస్తూ గల్ఫ్ ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కొరకు ఒక కార్పొరేషన్ , విదేశాంగ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలనీ గల్ఫ్‌లో ఉన్న ప్రవాసాంధ్రుల తరపున కోరారు.

కె. సురేష్ బాబు, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు మాట్లాడుతూ.. కువైట్ ప్రవాసాంధ్రులు చూపిస్తున్న అభిమానం విలువ కట్టలేనిదనీ.. తన తండ్రి ఆశయ సాధన కొరకు శ్రమిస్తున్న మా అధినేత జగన్ మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి కావడం తథ్యమనీ.. గల్ఫ్ సమస్యలను మా అధినాయకుడి దృష్టికి తీసుకోని పోయి తప్పకుండా కేవలం గల్ఫ్ కొరకే  ప్రవాసాంధ్రుల కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత ఘనంగా ఈ కార్యక్రమము నిర్వహించిన జయహో జగన్ కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కడప పార్లమెంట్ ఇంచార్జ్‌ కడప మేయర్ సురేష్ బాబు, శాసన సభ్యులు ఎస్.బి. అంజాద్ బాషా, జి. శ్రీకాంత్ రెడ్డి, కె.శ్రీనివాసులు, ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు మరియు కడప బజాజ్ ఎం.డి. ఎస్.బి. అంజాద్ బాషా, విశిష్ట అతిధి  షేక్ మజిన్ జర్ర అల్ సభ ( కువైట్ షేక్ ఫ్యామిలీ ) మరియు లక్కిరెడ్డి పల్లె జెడ్.పి. టి. సి. యం. సుదర్శన్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఏ. ఖాజా రహమతుల్లా, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ కార్యవర్గ సభ్యలు, రెడ్డీస్ అసోసియేషన్ సభ్యులు, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్, జగన్ సైన్యం సభ్యులు, వై.యస్.ఆర్. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top