తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలకు దిగడం లేదని చెప్పారు.
తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలకు దిగడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశిక ప్రతిని లోక్సభలో ప్రదర్శిస్తూ దానిపై కొద్ది సేపు చర్చించారు. ఈ సవరణతో ప్రవేశికకు ఎలాంటి భంగపాటు జరగదని, ప్రవేశిక జోలికి తాము వెళ్లబోమని చెప్పారు.
మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు లోక్సభలో గందరగోళానికి దారి తీశాయి. లోక్సభలో పలు ఆర్డినెన్స్పై జరిగిన ప్రశ్నోత్తరాల్లో విపక్షాలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. భూసేకరణ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింథియా, వెంకయ్యమధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే, సవాళ్లు ప్రతిసవాళ్లు వద్దని, సమస్య పరిష్కారం వైపుగా సాగుదామని వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్యాంగ ప్రవేశికలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.