ఈసీకి ఉత్తరాఖండ్‌ హైకోర్టు నోటీసులు | Uttarakhand: HC issues notices against EC, BJP Vikasnagar MLA MS Chauhan | Sakshi
Sakshi News home page

ఈసీకి ఉత్తరాఖండ్‌ హైకోర్టు నోటీసులు

Apr 27 2017 2:18 PM | Updated on Jul 11 2019 8:26 PM

ఈసీకి ఉత్తరాఖండ్‌ హైకోర్టు నోటీసులు - Sakshi

ఈసీకి ఉత్తరాఖండ్‌ హైకోర్టు నోటీసులు

ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాఖండ్‌ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది.

డెహ్రాడూన్‌ : ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాఖండ్‌ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. ట్యాంపరింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఈసీతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, బీజేపీ వికాస్‌ నగర్‌ ఎమ్మెల్యే చౌహాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది.

ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి నవ్‌ప్రభాత్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు... ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. వికాస్ నగర్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన విషయం తెలిసిందే.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement