ముండేకు ఘనంగా నివాళి | To Munde a grand tribute | Sakshi
Sakshi News home page

ముండేకు ఘనంగా నివాళి

Jun 8 2014 10:25 PM | Updated on Sep 2 2017 8:30 AM

ముండేకు ఘనంగా నివాళి

ముండేకు ఘనంగా నివాళి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, కేంద్ర గ్రామీణా అభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే సంస్మరణార్థం భివండీ పట్టణ బీజేపీ శాఖ ఆదివారం నిర్వహించింది.

భివండీ, న్యూస్‌లైన్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ జన తా పార్టీ (బీజేపీ) నేత, కేంద్ర గ్రామీణా అభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే సంస్మరణార్థం భివండీ పట్టణ బీజేపీ శాఖ ఆదివారం సంతాపసభ నిర్వహిం చింది. గోపాల్‌నగర్ పాటిదార్ హాల్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మహేష్ చౌగులే నేతృతృంలో చేపట్టిన ఈ సభకు బీజేపీ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతోపాటు కాంగ్రెస్, రాష్ట్రవాదీ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్పీఐ నాయకులు, సర్పంచులు హాజరయ్యారు.
 
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సం తాప సభలో మొదట ముండే చిత్రపటానికి పూల మాలలు వేసి, ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిముషాలు మౌనం పాటించారు. తదనంతరం మాట్లాడిన నాయకులు ముండేతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముండే పేదల నాయకుడని, చిన్నాపెద్దా భేదాలు లేకుండా అందరినీ ఆత్మీయంగా పలకరించేవారని బీజేపీ నేతలు అన్నారు.
 
ఈ సభకు బీజేపీ ఎంపీ కపిల్ పాటిల్, కాం గ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సురేష్ టావురే, విలాస్ పాటిల్, నిలేష్ చౌదరి, శ్యామ్ అగ్రవాల్, సుధాకర్ కముటం, భైరి నిష్కం, కుందెన్ పురుషోత్తం, సాయినాథ్ పవార్, మోహన్ వల్లాల్‌తోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజ రయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement