ప్రతిపాదనలే రాలేదు | The proposal did not come | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలే రాలేదు

Nov 30 2016 3:04 AM | Updated on Aug 31 2018 8:31 PM

హైకోర్టుల్లో పెరుగుతూ పోతున్న జడ్జి ఖాళీల సంఖ్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) విమర్శలు చేయడంతో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

జడ్జిల నియామకాలపై కేంద్రం  
 
 న్యూఢిల్లీ: హైకోర్టుల్లో పెరుగుతూ పోతున్న జడ్జి ఖాళీల సంఖ్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) విమర్శలు చేయడంతో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జడ్జిల నియామకాలపై గణాంకాలను ఉటంకించి నిర్లక్ష్యం సుప్రీం కోర్టు కొలీజియందే అని చెప్పేందుకు ప్రయత్నించింది. సుప్రీంలో ప్రస్తుతం ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిలో ఒకటి ఖాళీ అయి ఏడాది అయినా, నియామకానికి  కొలీజియం నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని ఒక ప్రభుత్వాధికారి చెప్పారు.

24 హైకోర్టుల్లో కలిపి 430 జడ్జి  స్థానాలు ఖాళీగా ఉండగా 279 పోస్టులకు ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. 2015-16 మధ్య హైకోర్టుల్లో నియామకాల కోసం 370 ప్రతిపాదనలు రాగా వాటిని తనిఖీ చేసి 328 ప్రతిపాదనలను ప్రభుత్వం కొలీజియానికి పంపిందని, కొలీజియం  290 పేర్లను ప్రాసెస్ చేసి వాటిలో 99 పేర్లను తిరస్కరించిందని తెలిపారు. 1990ల నుంచి హైకోర్టుల్లో నియమించిన జడ్జిల సంఖ్య సగటున ఏడాదికి 80 కాగా, ఈ ఏడాది ఇప్పటికే తాము 120 మంది జడ్జిలను నియమించామని అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement