క్వెట్టా ఉగ్రదాడిపై స్పందించిన పారికర్ | terrorism anywhere in any form can't be accepted:Manohar Parrikar | Sakshi
Sakshi News home page

క్వెట్టా ఉగ్రదాడిపై స్పందించిన పారికర్

Oct 25 2016 11:16 AM | Updated on Sep 4 2017 6:17 PM

పాకిస్తాన్ క్వెట్టాలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు.

న్యూఢిల్లీ : పాకిస్తాన్ క్వెట్టాలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ దళాలకు ఆయన సంతాపం తెలిపారు. తీవ్రవాదం ఎక్కడు, ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని పారికర్ స్పష్టం చేశారు. గత నెలలో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనపై ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చిందన్నారు.

కాగా పాకిస్తాన్‌ క్వెట్టాలోని పోలీసుల శిక్షణా శిబిరంపై  ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 59 మంది పోలీసులు దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement