న్యాయమూర్తుల కొరతతో బాగా ఇబ్బంది పడుతున్న సుప్రీంకోర్టుకు రెండు రోజుల్లో నలుగురు కొత్త జడ్జీలు రానున్నారు.
న్యాయమూర్తుల కొరతతో బాగా ఇబ్బంది పడుతున్న సుప్రీంకోర్టుకు రెండు రోజుల్లో నలుగురు కొత్త జడ్జీలు రానున్నారు. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ న్యాయవాది పేరును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవుల కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్‌లతో పాటు మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ ఎల్. నాగేశ్వరరావు పేరును కూడా రాష్ట్రపతి ఆమోదించినట్లు సమాచారం. ఈ నలుగురూ శుక్రవారం లేదా వచ్చే వారం మొదట్లో ప్రమాణ స్వీకారం చేయొచ్చని తెలుస్తోంది.