16 ఏళ్ల యువకుడు ఫేస్బుక్ అకౌంట్కు అసభ్యకర సందేశాలు పంపి మానసిక క్షోభకు గురిచేయడం, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
ఫేస్బుక్లో బూతు సందేశాలు పంపాడని.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
Nov 20 2013 4:00 PM | Updated on Jul 26 2018 5:21 PM
16 ఏళ్ల యువకుడు ఫేస్బుక్ అకౌంట్కు అసభ్యకర సందేశాలు పంపి మానసిక క్షోభకు గురిచేయడం, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ముంబైలో జరిగింది. ముంబై పత్రిక మిడ్ డే కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ముంబయి శివారు ప్రాంతం కాండివ్లి చెందిన ఈ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గత కొంత కాలంగా ఓ టీనేజర్ ఆమె ఫేస్బుక్ అకౌంట్కు బూతు సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. తన తండ్రితో కలసి వెళ్లి ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసు గురించి పట్టించుకోలేదు. మంగళవారం సాయంత్రం ఆ బాలిక తన గదిలో చదువుకుంటోంది. కాసేపటి తర్వాత ఆమె తల్లి వెళ్లి చూడగా గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆకతాయి కుర్రాడు ఫేస్బుక్ అకౌంట్కు మళ్లీ అసభ్యకర సందేశాలు పంపాడని, అందుకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే విచారిస్తామని పోలీసలు తెలిపారు. అలాగే మృతురాలి ఫేస్బుక్ అకౌంట్ కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement