మరో కిల్లర్‌ గేమ్ వైరల్‌..

Skull Breaker Challenge Has Been Raising Alarm Bells - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ పేరిట సోషల్‌ మీడియాలో పుట్టుకొచ్చిన సరికొత్త ట్రెండ్‌ ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్రమాదకర ఛాలెంజ్‌ వీడియా షేరింగ్‌ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. మధ్యలో వ్యక్తి పైకి ఎగురుతుండగా అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం ఈ ఆట ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి కింద పడేలా తన్నడం చూసిన చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్‌ మత్తులో కూరుకుపోయారు.

యాప్‌లో చూపిన విధంగా చిన్నారులు చేస్తుండటంతో వెన్నెముక, తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యువతలో ఈ ఛాలెంజ్‌కు ఆదరణ పెరిగితే వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీనేజ్‌ యువత ఎక్కువగా ఈ ట్రెండ్‌ను ఫాలోఅవడంతో ఇప్పటికే పలువురికి గాయలయ్యాయని ఎవరూ ఇలాంటి వాటి జోలికి పోరాదని సోషల్‌ మీడియా నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి : బన్నీ మనసును తాకిన టిక్‌టాక్‌ వీడియో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top