ఈవ్టీజింగ్ షార్ట్ ఫిలింకు.. 3 లక్షలకు పైగా హిట్లు! | Short film on eve-teasing goes viral online | Sakshi
Sakshi News home page

ఈవ్టీజింగ్ షార్ట్ ఫిలింకు.. 3 లక్షలకు పైగా హిట్లు!

Dec 2 2014 5:19 PM | Updated on Sep 2 2017 5:30 PM

ఈవ్టీజింగ్ షార్ట్ ఫిలింకు.. 3 లక్షలకు పైగా హిట్లు!

ఈవ్టీజింగ్ షార్ట్ ఫిలింకు.. 3 లక్షలకు పైగా హిట్లు!

మహిళలను వేధిస్తున్న అంశంపై కళ్లు తెరిపించేలా తీసిన ఓ షార్ట్ ఫిలిం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మహిళలను వేధిస్తున్న అంశంపై కళ్లు తెరిపించేలా తీసిన ఓ షార్ట్ ఫిలిం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. యూట్యూబ్లో ఇప్పటికి దీనికి 3.30 లక్షలకు పైగా హిట్లు వచ్చాయి. తాము చేసిన చిన్న ప్రయత్నానికి ఇంత భారీగా ఆదరణ రావడంతో దర్శకులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఖలీల్ హేరేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాకెట్ ఫిలింస్ ప్రమోట్ చేసింది. ఇందులో నలుగురు వ్యక్తులు రోడ్డుమీద మద్యం తాగుతుంటారు. అంతలో ఓ మహిళ అటువైపు వెళ్తుండగా వాళ్లు ఆమెను వేధిస్తారు. అయితే, ఆమె అక్కడక్కడే తిరగడంతో వాళ్లు షాకవుతారు.

నవంబర్ 20వ తేదీన ఈ వీడియోను యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే ఇప్పటికి దాదాపు 3.30 లక్షలకు పైగా హిట్లు వచ్చాయి. ఈవ్ టీజింగ్ పట్ల మనిషి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో, వివిధ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో తమ షార్ట్ ఫిలిం చూపిస్తుందని పాకెట్ ఫిలింస్ ఎండీ సమీర్ మోదీ అన్నారు. ఈ సినిమా తాము ఏదో ఊరికే తీసింది కాదని, ఇది తమ గుండె లోతుల్లోంచి వచ్చిందని దర్శకుడు హేరేకర్ అన్నారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, అత్యాచారాలపై తమ ఆవేదనను ఈ సినిమా రూపంలో తీశామని చెప్పారు. ఇంటర్నెట్లో దీనికి ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ రావడంతో.. ఇలాంటివి మరిన్ని తీయాలని నిర్ణయించుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement