ఘోర ప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి

Seven Childrens Died In Gujarat Accident - Sakshi

గాంధీ నగర్‌ : గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి  పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచమహల్‌లో చోటుచేసుకుంది. సమాచారం​ అందుకున్న పోలీసులు వాహనం నుంచి ముగ్గురిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన పిల్లలంతా ఏడు నుంచి పదహారేళ్ల మధ్య వయసువారే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top