మోదీని నవ్వుల్లో ముంచెత్తిన ఎంపీ | Samajwadi mp made narendra modi laugh loudly | Sakshi
Sakshi News home page

మోదీని నవ్వుల్లో ముంచెత్తిన ఎంపీ

Published Thu, Nov 24 2016 2:51 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

మోదీని నవ్వుల్లో ముంచెత్తిన ఎంపీ - Sakshi

మోదీని నవ్వుల్లో ముంచెత్తిన ఎంపీ

కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేయడంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేయడంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్షానికి చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నరేష్  అగర్వాల్ ఈ నవ్వులకు కారణమయ్యారు. చర్చ సందర్భంగా నరేష్ అగర్వాల్ మాట్లాడారు. ''పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఆయనకు చెప్పేవారు. అరుణ్ జైట్లీ నాకు తెలుసు కాబట్టి, ఆయన నా చెవిలో ఆ విషయం ఊదేవారు'' అని అగర్వాల్ చెప్పారు. దాంతో ఒక్కసారిగా మోదీ, జైట్లీ నవ్వుల్లో మునిగిపోయారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement