రైతన్నల కోసం రూ.1.5 లక్షల కోట్లు!

Rs 1.5 lakh crore for Agriculture sector budget - Sakshi

భారీ ప్యాకేజీ ప్రకటనకు సిద్ధమైన కేంద్రం

వ్యవసాయ రంగం బడ్జెట్‌ మూడు రెట్లు పెంపు

లోక్‌ సభ ఎన్నికలే లక్ష్యంగా ఎన్డీయే వ్యూహం  

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం రైతులకు ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్డీయే ప్రభుత్వం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.50 లక్షల కోట్ల మేర వ్యవసాయ ప్యాకేజీని ప్రకటించే అవకాశమున్నట్లు వెల్లడించాయి. అన్నదాతల ఆదాయం పెంపు, చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే విషయాన్ని కేంద్ర కేబినెట్‌ అజెండాలో చేర్చినట్లు పేర్కొన్నాయి. సోమవారం జరగాల్సిన ఈ భేటీ కొన్ని కారణాలతో వాయిదా పడింది.  

పరిశీలనలో ‘రైతు బంధు’..
పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు వడ్డీని మాఫీ చేయడం ఈ సిఫార్సుల్లో మొదటిది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.15వేల కోట్ల భారం పడనుంది. అలాగే ఆహార పంటలను సాగుచేసే రైతన్నలు చెల్లించే బీమా ప్రీమియంను పూర్తిగా మినహాయించాలని వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ‘రైతు బంధు’ ఒడిశా సర్కారు తెచ్చిన ‘కాలియా’ పథకాల తరహాలో రైతుల బ్యాంకు ఖాతాలకే నగదును నేరుగా బదిలీ చేసే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.  రైతులను     ఆదుకునేందుకు కేంద్రం తీసుకురానున్న ప్యాకేజీ రూ.1.50 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది.

దీంతోపాటు వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయి తే ఈ సిఫార్సులపై ప్రధాని మోదీ    అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైన తర్వాతే స్పష్టత రానుందని భావిస్తున్నారు. 2019–20 బడ్జెట్‌ çసమర్పణకు చాలా తక్కువ       సమయం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన అమలు చేసేలా,    లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేలా ఎన్డీయే ప్రభుత్వం ఈ కొత్త పథకానికి తుదిరూపు ఇవ్వనుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top