వెల్ లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు | Rajya sabha adjourned 10 minutes | Sakshi
Sakshi News home page

వెల్ లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు

Nov 27 2014 11:32 AM | Updated on Jun 4 2019 8:03 PM

రాజ్యసభ గురువారం 10 నిమిషాలు వాయిదా పడింది. హైదరాబాద్ నగరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పుపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సభ్యులు సభలో తీవ్ర నిరసన తెలిపారు.

న్యూఢిల్లీ: రాజ్యసభ గురువారం 10 నిమిషాలు వాయిదా పడింది. హైదరాబాద్ నగరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పుపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సభ్యులు సభలో తీవ్ర నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎయిర్ పోర్ట్ పేరు మార్చడాని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. వెళ్లి మీ సీట్లులో కూర్చోవాలని సభ్యులను రాజ్యసభ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. అందుకు కాంగ్రెస్ సభ్యులు ససేమిరా అనడంతో సభను 10 నిముషాల పాటు వాయిదా వేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సభలో స్పష్టం చేశారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement