2019లో విజయం సాధిస్తాం

 Rahul Gandhi as Congress chief will be game-changer

సోనియా, రాహుల్‌ గాంధీలు త్యాగాలు చేశారు

రాహుల్‌ నేతృత్వంలో నేను పనిచేస్తా

కేజ్రీవాల్‌ లీకుల వీరుడు

ప్రియాంక, రాహుల్‌తో మంచి భవిష్యత్‌

పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

సాక్షి, అమృత్‌సర్‌ : రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే.. దేశ రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోతుందని.. పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ శనివారం అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు త్యాగాలు చేశారని సిద్ధూ గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే.. ఆ పార్టే దేశం నుంచి కనుమరుగు అవుతుందని పంజాబ్‌ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌ సంపాల చేసిన వ్యాఖ్యలపై సిద్ధూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతో ఆశలు రగిలిస్తూ.. కాంగ్రెస్‌లో వేడిని పుట్టిస్తూ.. 2019 ఎన్నికలకు రాహుల్‌ గాంధీ పార్టీని సిద్ధం చేస్తున్నారని.. సిద్ధూ అన్నారు. వ్యక్తిత్వం అనే పదానికి రాహుల్‌ గాంధీ ఒక సిసలైన చిరునామా అని ఆయన పేర్కొన్నారు. ఆప్‌ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను మీడియా లీకుల వీరుడిగా సిద్ధూ అభివర్ణించారు. ఒకసారి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యాను.. లోపల ఏం మాట్లాడుకున్నామో అదంతా మీడియాలో వచ్చింది.. అదే నేను మేడం ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీలతో కనీసం పదిసార్లు వ్యక్తిగతంగా కలిశాను. ఒక్కమాట కూడా మీడియాలో లీక్‌ అవ్వలేదు. నాయకత్వం అదేనని సిద్ధూ అన్నారు.

రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే సుశిక్షుతైడన సైనికుడిగా అయన వెంట నడుస్తాను అని సిద్ధూ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌తో ఉన్నారని సిద్ధూ చెప్పారు. రాహుల్‌ గాంధీ నేత్వత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధిస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top