బీసీ బడ్జెట్‌ను రూ.50 వేల కోట్లకు పెంచాలి’ | Sakshi
Sakshi News home page

బీసీ బడ్జెట్‌ను రూ.50 వేల కోట్లకు పెంచాలి’

Published Fri, Jun 1 2018 3:02 AM

R krishnaiah on bc budget - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్‌లో బీసీల సంక్షేమ వాటాను పెంచాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్‌ గెహ్లట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన.. కేంద్రం 24 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు రూ.900 కోట్లే కేటాయించిందన్నారు.

ఈ వాటాను రూ.50 వేల కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించినా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర రాయితీలు పొందలేక విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారన్నారు. కేంద్రంలో బీసీల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను సాచురేషన్‌ పద్ధతిలో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలకు 80 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని, రూ.60 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement