కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ పూజలు | Prime Minister Narendra Modi Arrives In Dehradun | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ పూజలు

Published Wed, Nov 7 2018 10:43 AM | Last Updated on Wed, Nov 7 2018 12:01 PM

Prime Minister Narendra Modi Arrives In Dehradun - Sakshi

కేదార్‌నాథ్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

సిమ్లా : ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించనున్నారు.

2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి కావడం గమనార్హం. కాగా, 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు.  తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌ బోర్డర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement