డ్రగ్స్‌ పేరుతో రస్నా పౌడర్‌

Police Department Tweet On Drug Peddlers Sell Rasna As Drugs - Sakshi

షిల్లాంగ్‌: దేశ వ్యాప్తంగా పోలీసు డిపార్టుమెంట్‌ వారు సోషల్‌ మీడియాలో వినూత్నమైన ట్వీట్‌లు చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం మేఘాలయ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్‌ అమ్మేముఠాలపై ట్విట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో డ్రగ్స్‌ పేరుతో రస్నా పౌడర్‌ను అమ్ముతున్నారు. అదే విధంగా డ్రగ్‌ మాదిరిగా ఉన్న రస్నా పౌడర్‌ను కొని మోసపోయిన వారు తమకు ఫిర్యాదు చేయాలని’ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అస్సాంలోని గౌహతి పోలీసులు కూడా వినూత్నంగా ‘ మీలో ఏవరైనా 590 గ్రాముల గంజాయి పోగొట్టుకున్నారా ? అయితే వచ్చి మాకు ఫిర్యాదు చేయండి’  అని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు చేస్తున్న ఈ వినూత్నమైన ట్విట్లు వైరల్‌ మారుతున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top