
మాలే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నేడు (శనివారం) మాల్దీవులకు చేరుకున్నారు. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారిగా మాలీని సందర్శిస్తున్నారు. ఆ దేశ అత్యున్నత పురస్కారం, ప్రఖ్యాత ‘నిషానిజుద్దీన్’ అవార్డుతో మాల్దీవుల అధ్యక్షుడు ప్రధాని మోదీని సత్కరించనున్నారు. అలాగే మాల్దీవుల పార్లమెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. పర్యటనను ఉద్దేశించి ప్రధాని ట్వీట్ కూడా చేశారు. పొరుగుదేశాలకు భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. తనను మాల్దీవులకు ఆహ్వానించినందుకు ఆ దేశాధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్య, సివిల్ సర్వెట్ల శిక్షణ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఆదివారం శ్రీలంకలోనూ ప్రధాని పర్యటించనున్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 దేశాల పార్లమెంట్లలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భూటాన్, ఆస్ట్రేలియా, ఫిజి, మారిషెస్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్థాన్, అమెరికా, యుగాండ పార్లమెంట్లు ఈ జాబితాలో ఉండగా.. తాజాగా మాల్దీవులు ఈ జాబితాలో చేరనుంది. 2011లో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ మాల్దీవులను సందర్శించారు.
Friendship forever!
— Raveesh Kumar (@MEAIndia) June 8, 2019
PM @narendramodi arrives in Male, capital of Maldives to a warm reception by Foreign Minister @abdulla_shahid. PM was last here for President @ibusolih ‘s inauguration ceremony in November 2018. #Neighbourhoodfirst@MDVForeign @presidencymv pic.twitter.com/yUYWMgiDmf