‘ప్రతి పల్లెకూ విద్యుత్‌ వెలుగులు’

 PM Modi Says Electricity Reached Every Village Of Country   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రతి పల్లెకూ విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  పేదరిక రహిత దేశంగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందని ప్రపంచ ఏజెన్సీలు కితాబిస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ 51వ ఎడిషన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందచేశారు. దేశ యువతరం భిన్న రంగాల్లో దూసుకుపోతూ దేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తోందని ప్రశంసించారు. వచ్చే ఏడాది జనవరి 15న ప్రయాగరాజ్‌లో ప్రారంభమయ్యే కుంభ్‌ మేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఘనమైన సాంస్కృతిక పండుగగా కుంభమేళాను యునెస్కో గుర్తించిందని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top